మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 02:23:59

జర్నలిస్టులను ఆదుకోండి

జర్నలిస్టులను ఆదుకోండి

  • సీఎం కేసీఆర్‌కు మీడియా అకాడమీ చైర్మన్‌  అల్లం నారాయణ విజ్ఞప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రతి జర్నలిస్టుకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించాలని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మూడు పేజీల లేఖ రాశారు. జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద రూ.25 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టుల సంక్షేమనిధికి రూ.65.50 కోట్ల నిధులు విడుదలచేయాలని కోరారు. అత్యవసర సర్వీసులైన వైద్యం, పారిశుద్ధ్యం, పోలీసులతో సమానంగా జర్నలిస్టులు కూడా 24 గంటలు ప్రమాదకరమైన వాతావరణంలో పనిచేస్తున్నారని తెలిపారు. జర్నలిస్టులకు రూ.20 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తిచేశారు. ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించడానికి రూ.50 లక్షల కార్పస్‌ ఫండ్‌ మంజూరుచేయాలని అల్లం నారాయణ ప్రభుత్వాన్ని కోరారు.logo