బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 03:01:04

శ్రీశైలం ప్లాంట్‌లోమెకానికల్‌ స్పింజన్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

శ్రీశైలం ప్లాంట్‌లోమెకానికల్‌ స్పింజన్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

  • త్వరలో 5వ యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తి

శ్రీశైలం: శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలోని ఐదో యూనిట్‌ మెకానికల్‌ స్పింజన్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైందని ప్లాంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ మేక ప్రభాకర్‌రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఐదో యూనిట్‌ను స్విచ్‌ఆన్‌ చేసి సాంకేతిక ప్రమాణాల నిర్ధారణ సక్సెస్‌ కావడంతో అధికారులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. గత నెల 26న విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్లాంట్‌లోని 1,2వ యూనిట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. గడిచిన 20 రోజులుగా ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా నిరంతరం విద్యుదుత్పత్తి సజావుగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.