గురువారం 02 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 02:00:22

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరిక

మహబూబ్‌నగర్‌: నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేయాలని చూస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. బుధవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరం లో కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. వారికి సహకరించిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే కలెక్టరేట్‌లోని టోల్‌ఫ్రీ నంబర్‌ 08542-241165కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని సూచించారు. నకిలీ విత్తనాలపై నిఘాకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, వీరు నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు. అనంతరం నూతనంగా నియమితులైన 160 మంది నర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ నియామక పత్రాలను కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి అందజేశారు.


logo