సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 02:24:22

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

  • బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: వర్షకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు తమ బాధ్యతగా ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని డంప్‌యార్డులో చెత్తను తొలగించేందుకు రూ.65 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ప్రొక్లెయిన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం రాంపూర్‌లో నిల్వ ఉన్న నీటిలో గంబూషియా చేపలు వదిలారు. 9వ డివిజన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన వీధిదీపాలను ప్రారంభించారు. 31వ డివిజన్‌లో రూ.93 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 8 వరకు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు చేపడుతున్నామని తెలిపారు.  


logo