శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 29, 2020 , 14:40:31

ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా నివారణకు చర్యలు

ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా నివారణకు చర్యలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో కరోన నివారణకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. బుధవారం కరోనా పరిస్థితిపై అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో కరోనా ఇంకా సామాజిక వ్యాప్తి పరిస్థితికి చేరలేదని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా సోకిన ఉద్యోగులు విధులకు దూరంగా ఉండాలని,  మిగతా ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని అన్నారు.

 మహారాష్ట్ర,  మార్కజ్ నుంచి వలస వచ్చిన వారి కారణంగా ఏప్రిల్ 8న మొదటి కేసు నమోదైందని అప్పటి నుంచి సామాజిక వ్యాప్తి జరగటం లేదన్నారు.  మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్ ల నుంచి జనాల రాక పోక పోకలతో కొన్ని పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు.  జిల్లాకు 975 మెడికల్ కిట్లు వచ్చాయని వచ్చాయని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి నిర్ధారణ పరీక్షలు చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా రెవెన్యూ అధికారి కదం సురేష్, ఆర్డీఓ సిడాం దత్తు, జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు తదితరులు ఉన్నారు .
logo