గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 01:55:02

కార్పొ‘రేట్ల’పై వేటు వేశాం

కార్పొ‘రేట్ల’పై వేటు వేశాం

  • కొవిడ్‌ చికిత్సకు అధిక ధరలపై చర్యలు 
  • 50 ఫిర్యాదులకు పరిష్కారం 
  • 38 దవాఖానలకు షోకాజ్‌ నోటీసులు
  • 4 ఎన్జీవో ఐసొలేషన్‌ కేంద్రాలకు అనుమతి 
  • హైకోర్టుకు పబ్లిక్‌హెల్త్‌ డైరెక్టర్‌ నివేదిక 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 చికిత్సకు అధిక బిల్లులు వసూలు చేసిన కార్పొరేట్‌ దవాఖానలపై చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ హైకోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు 211 ఫిర్యాదులు రాగా 50 పరిష్కరించినట్లు పేర్కొన్నది. మిగతా 161 ఫిర్యాదుల్లో 38 దవాఖానలకు షోకాజ్‌ నోటీసులు జారీచేశామని వివరించింది. మూడు దవాఖానల్లో కొవిడ్‌ చికిత్సలకు అనుమతులు రద్దు చేసినట్టు తెలిపింది. ఎన్జీవోల నుంచి ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు నాలుగు దరఖాస్తులు రాగా అనుమతి ఇచ్చినట్టు కుటుంబ సంక్షేమ, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 

ప్రతి ఫిర్యాదునూ సంబంధిత డీఎంఅండ్‌హెచ్‌వోతోపాటు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ ప్రయోజనాలు పొంది ఉచిత చికిత్స అందించని మూడు దవాఖానలకు నోటీసులు ఇచ్చామని, చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు నివేదించారు. సీఎస్‌ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటుచేశామని, ఎక్కువ మంది ప్రజలతో ముడిపడి ఉన్న ఫిర్యాదుల పర్యవేక్షణ ఆయనే చేపడుతున్నారని శ్రీనివాసరావు వివరించారు. 104, వాట్సప్‌ నంబర్‌, ఇత ర మార్గా ల ద్వారా వచ్చే ఫిర్యాదులను ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో పరిశీలన జరిపి ప్రధాన అంశాలను సీఎస్‌ పరిశీలనకు తీసుకెళ్తున్నామని, ఆ యన మార్గనిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. 21 నుంచి 50 ఏండ్ల వారు కొవిడ్‌ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేర కు మీడియా బులెటిన్‌లో అడ్వైజరీని ఎన్ని టెస్ట్‌లు చేశామనే వివరాలతో ప్రచురిస్తున్నట్టు వెల్లడించారు. logo