సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 14:54:51

సేవ‌తోనే జీవితానికి ప‌ర‌మార్థం : మంత్రి ఎర్రబెల్లి

సేవ‌తోనే జీవితానికి ప‌ర‌మార్థం : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : సేవ‌తోనే జీవితానికి అస‌లైన ప‌ర‌మార్థం ల‌భిస్తుంద‌ని, ప్రజలను కష్టకాలంలో ఆదుకున్న వాళ్లే అస‌లైన నాయ‌కుల‌ని  పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. జిల్లాలోని పాల‌కుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పాల‌కుర్తి, కొడ‌కండ్ల‌, దేవ‌రుప్పుల మండ‌లాల‌కు ఉప‌యోగ ప‌డేవిధంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక స‌దుపాయాల అంబులెన్స్ వాహ‌నాన్ని సంబంధిత వైద్యాధికారుల‌కు అంద‌చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఓట్లప్పుడే కాకుండా నాయకులు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆదుకోవాల‌న్నారు. ఇప్పటి వరకు త‌న‌కు తోచిన విధంగా నిత్యావ‌స‌ర స‌రుకులు, మాస్కులు, సానిటైజ‌ర్లు పంపిణీ చేశామ‌న్నారు. ఇదే త‌ర‌హాలో ఇప్పుడు తాజాగా ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్లు ఉండే అత్యాధునిక అంబులెన్స్ వాహ‌నాన్ని ప్రజ‌ల‌కు అందిస్తున్నామ‌ని చెప్పారు. మంత్రి కేటీఆర్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా అంబులెన్స్ లను అందజేస్తున్నామని పేర్కొన్నారు.

  

ఈ సంద‌ర్భంగా మంత్రి పాల‌కుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సంద‌ర్శించారు. హాస్పిట‌ల్ ని ప‌రిశీలించారు. హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్న పోస్టు ఆప‌రేష‌న‌ల్ వార్డులోని మ‌హిళ‌ల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అలాగే క‌రోనా బాధితుల కోసం పాల‌కుర్తి పీఆర్ ఏఈ మహ్మద్ గౌస్ పాషా తన నెల వేత‌నాన్ని విరాళంగా మంత్రికి అందజేశారు..పాషా ఔదార్యాన్ని మంత్రి అభినందించారు. logo