గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:19

బడి కూరగాయలతోనే భోజనం

బడి కూరగాయలతోనే భోజనం

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పీర్‌మహ్మద్‌ షేక్‌.. పాఠశాలను ఉద్యానవనంలా మార్చారు. రెండో విడత హరితహారం నుంచి బడిలో 500 మొక్కలు నాటి, వాటి కిందే పిల్లలకు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. బండరాళ్లు ఉండటంతో రాక్‌గార్డెన్‌ను తయారుచేశారు. సీతాఫలం, జామ, బొప్పాయి పండ్ల మొక్కలు, పలు పూల మొక్కలు నాటి సంరక్షించారు. బర్త్‌డే గార్డెన్‌కు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల పుట్టినరోజున ఒక మొక్క నాటాలనే నిబంధన పెట్టారు. పాఠశాలలో సాగుచేస్తున్న కూరగాయలతోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పిల్లల్లో రక్తహీనతను పోగేట్టేందుకు బచ్చలికూర, గోంగూర, చుక్కకూర, కరవివేపాకును పెంచారు. వారానికోసారి కరివేపాకు పొడిని భోజనంలో తీసుకునేలా ప్రత్యేక దృష్టిపెట్టారు. సీఎం ఫోన్‌ చేయడం పట్ల పీర్‌మహ్మద్‌ సంతోషం వ్యక్తం చేశారు.


logo