శుక్రవారం 29 మే 2020
Telangana - Mar 28, 2020 , 16:26:16

ఇటుక బట్టి వలస కార్మికులకు భోజన వసతి: మహేశ్‌ భగవత్‌

ఇటుక బట్టి వలస కార్మికులకు భోజన వసతి: మహేశ్‌ భగవత్‌

హైదరాబాద్‌: ఇటుక బట్టీల్లోని కార్మికులకు భోజన వసతి కల్పిస్తున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. దాతల సహాకారంతో కార్మికులకు భోజన వసతి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బీహార్‌, ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుంటారు కావున ఎక్కడి వారు అక్కడే ఉండాలి. కార్మికులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇబ్బందులు వస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. 


logo