ఆదివారం 01 నవంబర్ 2020
Telangana - Sep 20, 2020 , 03:34:38

జిల్లాల్లో 3 నెలలు తప్పనిసరి!

జిల్లాల్లో 3 నెలలు తప్పనిసరి!

  • పీజీ మెడికల్‌ విద్యార్థులకు ఎంసీఐ మార్గదర్శకాలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మెడికల్‌ పీజీ విద్యార్థులు శిక్షణలో భాగంగా మూడు నెలలపాటు జిల్లా దవాఖానల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇది ప్రారంభమవుతుందని తెలిపింది. డిస్ట్రిక్‌ రెసిడెన్సీ ప్రొగ్రాంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొంది. ఈ ట్రైనింగ్‌ చేయని విద్యార్థులను కోర్సు తుది పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వరు.