ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 15:03:39

సార‌య్య‌, గోర‌టి వెంక‌న్న‌కు ఎంబీసీ యునైటెడ్ ఫ్రంట్‌ స‌న్మానం

సార‌య్య‌, గోర‌టి వెంక‌న్న‌కు ఎంబీసీ యునైటెడ్ ఫ్రంట్‌ స‌న్మానం

హైద‌రాబాద్ : శాస‌న మండ‌లికి ఎంపికైన బ‌స్వ‌రాజు సార‌య్య‌, గోర‌టి వెంక‌న్న ద‌ళిత‌, గిరిజ‌న‌, మైనారిటీ‌ల గొంతుక‌గా మారా‌ల‌ని అత్యంత వెనుకబడిన కులాల ఐఖ్య వేదిక(ఎంబీసీ యునైటెడ్ ఫ్రంట్) పేర్కొంది. చ‌ట్ట స‌భ‌ల‌కు వీరి ఎంపిక‌ను ఎంబీసీ యునైటెడ్ ఫ్రంట్ సంపూర్ణంగా స్వాగ‌తిస్తుంద‌ని ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కలుకూరి రాజు తెలిపారు. బస్వ‌రాజు సారయ్య, గోరెంటి వెంకన్నలను కలసి శాలువ కప్పి అభినంద‌న‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రంట్ రాష్ట్ర ఉఫాధ్యక్షుడు రుద్రారాపు శంకర్, సహాయ కార్యదర్శి నడిగోప్ప శ్రీనువాస్, రాష్ట్ర నాయకులు షెక్ ముస్తాఫా, బండారు వెంకట్, పిల్లి ఆరుణ్ కుమార్,  హైద‌రాబాద్ నగర కన్వీనర్ పవన్ సింగ్, మోహన్ సింగ్‌లు పాల్గోన్నారు.

ఈ సంద‌ర్భంగా క‌లుకూరి రాజు మాట్లాడుతూ.. బ‌స్వ‌రాజు సార‌య్య‌ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉండి కూడా తెలంగాణ రాస్ట్ర సాధనలో తన వంతు చేసిన కృషికి ఈ గుర్తింపు ద‌క్కిన‌ట్లుగా తాము భావిస్తున్నామ‌న్నారు. నిజాయితీ, నిబద్దతకు నిలువుటద్దం, అత్యంత‌ వెనుకబడిన కులాల ప్రతినిధిగా ఉన్నార‌న్నారు. అదేవిధంగా తెలంగాణ అస్ధిత్వంను, సకల భాదలను, సమైక్యాంధ్ర‌లో సబ్బండ వర్గాలు పడుతున్న ఇబ్బందులను తన‌ గళం ద్వారా వినిపించిన ప్రజా కవి, వాగ్గేయ కారుడు గోరేటి వెంకన్నను శాసనమండలికి ఎంపిక చేసి సముచిత గౌరవం ఇచ్చార‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్సించిన అవకాశంతో  తెలంగాణలోని ఎంబీసీలు, దళిత, గిరిజన మైనారిటీల గొంతుకగా మారాలని విజ్ణప్తి చేస్తున్నామ‌న్నారు. 

ఇదే సమయంలో రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందిన కార్పోరేషన్లతో పాటు ఎంబీసీ ఫైనాన్స్ కార్పోరేషన్‌ను భ‌ర్తీ చేసి పూర్తిస్థాయి పాలక మండలిని నియమించాలని ఎంబీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంద‌న్నారు. అదేవిధంగా గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేసి యువతకు ఉపాధి కల్పించాలని విజ్ణప్తి చేశారు.