సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 21:13:17

యాజమాన్య కోటా సీట్ల భర్తీకి రెండో విడుత నోటిఫికేషన్‌

 యాజమాన్య కోటా సీట్ల భర్తీకి రెండో విడుత నోటిఫికేషన్‌

వరంగల్‌ చౌరస్తా: ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాలకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు రెండో విడుత నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. దీని ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 నుంచి 24వ తేదీ సాయంత్రం 6గంటల వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. మొదటి విడుత కౌన్సెలింగ్‌లో సీటు పొంది చేరని అభ్యర్థులు, ఆల్‌ ఇండియా కోటాలో సీటు పొంది చేరిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని తెలిపారు. మరింత సమాచారానికి www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి.