బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 13:18:08

80 శాతం మందిని గుర్తించాం : జీహెచ్‌ఎంసీ మేయర్‌

80 శాతం మందిని గుర్తించాం : జీహెచ్‌ఎంసీ మేయర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో ఇప్పటికే 80 శాతం మందిని గుర్తించామని ఆయన పేర్కొన్నారు. మిగతా వారు కూడా వైద్య సిబ్బందికి సహకరించాలని మేయర్‌ విజ్ఞప్తి చేశారు. ఎంటమాలజీ విభాగం ద్వారా వీధి కుక్కలకు ఆహారం అందిస్తామని చెప్పారు. 1500 మంది యాచకులకు భోజనం అందిస్తున్నామని మేయర్‌ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు రవాణా వసతి కల్పిస్తున్నామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఎస్‌ఆర్‌డీపీ పనులు సాగుతున్నాయని బొంతు రామ్మోహన్‌ స్పష్టం చేశారు.


logo