గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 13:25:08

ఒక‌ట్రెండు రోజుల్లో సాధార‌ణ ప‌రిస్థితులు: మేయ‌ర్ బొంతు

ఒక‌ట్రెండు రోజుల్లో సాధార‌ణ ప‌రిస్థితులు: మేయ‌ర్ బొంతు

హైద‌రాబాద్‌: ఒక‌ట్రెండు రోజుల్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అన్నారు. రెండురోజుల‌పాటు కురిసిన భారీ వాన‌ల‌తో స‌రూర్‌న‌గ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాలు పూర్తిగా నీట‌మునిగాయి. దీంతో ఆయ‌న ఈరోజు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిథులు, అధికారుల‌తో క‌లిసి ముంపు ప్రాంతాలైన సింగ‌రేణి కాల‌నీ,   స‌రూర్‌న‌గ‌ర్‌లోని వివిధ ప్రాంతాల్లో ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించారు. సహాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రంగా చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. బాధితుల‌తో మాట్లాడి వారికి భ‌రోసా ఇచ్చారు. సింగ‌రేణి కాల‌నీలో అపార్ట్‌మెంట్ వాసుల‌కు పాల ప్యాకెట్లు స‌ర‌ఫ‌రా చేశారు. అనంత‌రం స‌రూన‌గ‌ర్ చెరువు, కాలువను ప‌రిశీలించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo