మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 17, 2020 , 10:38:00

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్‌ రామ్మోహన్‌

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్‌ రామ్మోహన్‌

హైదరాబాద్‌ : నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. ఖైరతాబాద్‌ జోన్‌లోని పలు కాలనీల్లో క్షేత్రస్థాయిలో తిరిగి మేయర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చరించారు. అనంతరం ఆయన స్పందిస్తూ.. పరిసరాలను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచడంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా కార్మికులు తమ విధులను కొనసాగిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అటువంటి కార్మికులకు కావాల్సిన సౌకర్యాలను చూడాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.logo