బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 11:55:32

దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో బ‌స్ షెల్ట‌ర్లను ప్రారంభించిన మేయ‌ర్‌

దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో బ‌స్ షెల్ట‌ర్లను ప్రారంభించిన మేయ‌ర్‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో అధునాత‌న సదుపాయాల‌తో నిర్మించిన 6 బ‌స్ షెల్ట‌ర్ల‌ను జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ రామ్మోహ‌న్ మాట్లాడుతూ.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో అత్యాధునిక ప‌ద్ధ‌తుల్లో వెయ్యి బ‌స్ షెల్ట‌ర్ల‌ను నిర్మించామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే 292 బ‌స్ షెల్ట‌ర్ల‌ను ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తెచ్చామ‌ని గుర్తు చేశారు. ఏసీ బ‌స్ షెల్ట‌ర్ల వ‌ద్ద వాటి భ‌ద్ర‌త‌కై సెక్యూరిటీ గార్డుల‌ను నియ‌మించామ‌ని తెలిపారు.  

హ‌బ్సిగూడ డివిజ‌న్‌లోని ర‌వీంద్ర న‌గ‌ర్‌, గ్రీన్ హిల్స్ కాల‌నీల్లో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ ప‌నుల‌కు మేయ‌ర్ రామ్మోహ‌న్ శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప్ప‌ల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బేతి స్వ‌ప్న రెడ్డితో పాటు స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.