శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 16:57:18

పేద‌లంటే కాంగ్రెస్ పార్టీకి ప‌ట్ట‌దు : మేయ‌ర్

పేద‌లంటే కాంగ్రెస్ పార్టీకి ప‌ట్ట‌దు : మేయ‌ర్

హైద‌రాబాద్ : పేద‌లంటే కాంగ్రెస్ పార్టీకి ప‌ట్ట‌దు అని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ స్ప‌ష్టం చేశారు. భట్టి విక్ర‌మార్క స‌వాల్‌ను ప్ర‌భుత్వం స్వీక‌రించి డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను చూపిస్తుంటే.. ఆ ఇండ్ల‌ను చూసి ఓర్వ‌లేక కాంగ్రెస్ నేత‌లు పారిపోయారు. పేద ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంటే భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు మిగ‌తా నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆ పార్టీ నాయ‌కులు రాజ‌కీయ డ్రామాలు ఆడుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా గ‌తంలో న‌గ‌ర శివార్ల‌లోనే ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మించి ఇచ్చింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో స్థ‌లం లేక‌నే శివార్ల‌లో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్ర‌కారం నిరుపేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను క‌ట్టిస్తున్నార‌ని మేయ‌ర్ తేల్చిచెప్పారు. శివార్ల‌లో నిర్మించే ఇండ్ల‌లో 90 శాతం నివాసాల‌ను జీహెచ్ఎంసీ ప్ర‌జ‌ల‌కే కేటాయిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ల‌క్ష ఇండ్లు చూపిస్తే ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాలో అర్థం కాక కాంగ్రెస్ నేత‌లు పారిపోయారు అని మేయ‌ర్ రామ్మోహ‌న్ పేర్కొన్నారు.


logo