గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 16:42:46

బల్దియాలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు...

బల్దియాలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు...

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఫోటోకు మేయర్‌ బొంతురామ్మోన్‌, కార్పోరేటర్లు పాలాభిషేకం చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ... బల్దియాలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. కేబుల్‌ బ్రిడ్జి మే నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. హుస్సెన్‌సాగర్‌ ప్రక్షాళన పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. ప్రభుత్వం హైదరాబాద్‌ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ సిద్దం చేస్తున్నారు. మూసీ నది సుందరీకరణ కోసం బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. బస్తీ దవాఖానాలు 350కి పెంచబోతున్నాం. ఇప్పటి వరకు నగరంలో 25వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 40వేల ఇండ్లు నిర్మాణ చివరి దశలో ఉన్నాయి. నగరంలో అక్షరాస్యత పెంచేందుకు కృషిచేస్తున్నాం. ఇది ఎన్నికల కోసం కేటాయించిన బడ్జెట్‌ కాదని తేల్చి చెప్పారు. నగర అభివృద్ధికి ప్రతీ సంవత్సరం కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. 


logo