బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:33:43

ఎండ దడ

ఎండ దడ

ఈ సీజన్‌లో ఎండలు దడ పుట్టించబోతున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన వడగాలులు రాబోయే సమ్మర్‌ సీజన్‌లో నేలను భగభగ మండించబోతున్నాయి. ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణకు వడగాలుల తీవ్రత అధికంగా ఉండబోతున్నది. తెలంగాణ హీట్‌ వేవ్‌ జోన్‌లో ఉన్నట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. మార్చి నుంచి మే చివరి వారం వరకు తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ర్టాలు ఎండకాలానికి విలవిల్లాడి పోతాయని హెచ్చరిస్తున్నది.

  • ఈసారి పెరుగనున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
  • సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్‌ వరకు ఎక్కువ నమోదయ్యే అవకాశం
  • రాష్ట్రంలో వడగాడ్పులూ అధికమే
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఈ ఎండాకాలం భయపెట్టనున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ సెల్సియస్‌ వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న అంచనావేశారు. గత ఏడాది కంటే ఈ సారి వడగాడ్పులు కూడా ఎక్కువ రోజులు ఉండొచ్చని తెలిపారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో ఈ పరిస్థితి ఉంటుందని ‘నమస్తే తెలంగాణ’తో పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల ఉదయం వేళ ఇప్పటికీ చలిగాలుల ప్రభావం ఉన్నా.. పగటిపూటఎండలు మండుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మార్చి నుంచి మే వరకు ఎండల తీవ్రతను భారత వాతావరణ విభా గం అంచనావేసింది. దీనిప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్య మహారాష్ట్రలు హీట్‌ వేవ్‌ జోన్‌ (హెచ్‌డబ్ల్యూ జోన్‌) పరిధిలో ఉన్నాయని, ఇక్కడ సాధారణస్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విశ్లేషించింది. గతంలో కంటే వడగాడ్పులు ఎక్కువ రోజులు వీచే అవకాశం ఉన్నదని పే ర్కొన్నది. మార్చి నుంచి మే మధ్య ఎండలు ముదురుతాయని తెలిపింది.


గత ఏడాది ఎండ తీవ్రత తక్కువే 

గత ఏడాది తెలంగాణలో ఎండల తీ వ్రత అంత ఎక్కువేం లేదు. జగిత్యాల జిల్లాలోని వెలగటూరులో అత్యధికంగా 47.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, చాలాజిల్లాల్లో మే నెలలో 47 డిగ్రీలుగా నమోదయ్యాయి. 2017, 2018 సంవత్సరాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఓ మోస్తరుగా ఉన్నాయి. తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ విశ్లేషణ ప్రకారం.. 2013 నుంచి ఇప్పటివరకు పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జన్నారంలో, జగిత్యాల జిల్లా రాయికల్‌లో, జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లా చిట్యాలలో 48.9 డిగ్రీ ల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 47.6 డిగ్రీలలో పే నమోదైనట్టు రికార్డులు చెప్తున్నాయి. 


logo
>>>>>>