బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 23, 2020 , 00:50:52

సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ ప్రభంజనం

సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ ప్రభంజనం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్స్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా శుక్రవారం ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో తమ విద్యాసంస్థ విద్యార్థులు అఖిలభారతస్థాయిలో ప్రభంజనం సృష్టించినట్టు మాస్టర్‌ మైండ్స్‌ అడ్మిన్‌ అడ్వైజన్‌ మోహన్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంఏ ఫౌండేషన్‌లో ఎన్‌ చైతన్యసాయి ఆలిండియా టాప్‌ మార్కులు (378) సాధించాడని తెలిపారు. సీఎంఏ ఇంటర్‌లో మొదటి 50 ర్యాంకుల్లో ఆలిండియా మొదటి ర్యాంకుతోపాటు 18 ర్యాంకులు, సీఎంఏ ఫైనల్‌ ఫలితాల్లో మొదటి 50 ర్యాంకుల్లో 22 ర్యాంకులు తమ విద్యార్థులే కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. అఖిలభారత స్థాయిలో ప్రకటించిన ర్యాంకుల్లో 40 శాతానికిపైగా ర్యాంకులు మాస్టర్‌మైండ్స్‌ విద్యార్థులే సాధించారని వెల్లడించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.


logo