సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 16:19:08

కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతుల భారీ ర్యాలీ

కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతుల భారీ ర్యాలీ

కుమ్రం భీం ఆసిఫాబాద్ : కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జిల్లాలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.  వంద ట్రాక్టర్లు, ఐదు వందల బైకులతో చేపట్టిన ర్యాలీలో  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవలక్ష్మి ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. వాంకిడి మండల కేంద్రం నుంచి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. రైతుల భూములతో పాటు వారి ఆస్తులు, పంటలకు ఎలాంటి నష్టం రాకుండా చూసుకుంటున్నారని తెలిపారు.logo