ఆదివారం 01 నవంబర్ 2020
Telangana - Sep 27, 2020 , 07:56:57

జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో

జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో

జోగులాంబ గద్వాల : ఎగువ కురుస్తున్న కుండపోత వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం.. దాదాపు 4.06 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 43 గేట్లను ఎత్తి 4,17,770 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 1045 అడుగులు (9.657 టీఎంసీలు) ప్రస్తుతం 1044 అడుగులు (8.730 టీఎంసీలు)గా ఉంది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.