శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 17:49:54

బీజేపీని వీడి టీఆర్ఎస్ లో భారీగా చేరికలు

 బీజేపీని వీడి టీఆర్ఎస్ లో భారీగా చేరికలు

సిద్దిపేట : పల్లె పహాడ్ ముంపు గ్రామస్తులు టీఆర్ఎస్ కు జై కొట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ మాత్రమే తమ సమస్యలను పరిష్కరిస్తుందని నమ్మారు.  అందుకే గ్రామ సర్పంచ్ కీసర సంతోషతో సహా వార్డు మెంబర్లు, 200 మంది బీజేపీకి రాజీనామా చేసి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆయన స్వగృహాంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎన్నిక ఏదైనా ఓట్లన్నీ టీఆర్ఎస్ కే వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ముంపు గ్రామాల ప్రజల పట్ల సానుభూతితో ఉంటారు. గజ్వేల్ కొండ పోచమ్మ సాగర్ ముంపు బాధితులతో ఎలా ఉన్నారో.. మల్లన్న సాగర్ ముంపు బాధితులతో అదే తరహాలో ఉంటారన్నారు. పల్లె పహాడ్ గ్రామం ఆ రోజూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం భూములిచ్చి ముందు కొచ్చినట్లుగానే ఇవాళ కూడా ముందు వరుసలో నిలబడి అందరికీ మార్గదర్శకంగా నిలబడిందని ప్రశంసించారు.


గతంలో బీజేపీ నాయకులు రెచ్చగొట్టి ముంపునకు గురయ్యే ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, అప్పుడు ఎన్నికల ముందు వచ్చినోళ్లే.. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు వస్తున్నారని తెలిపారు. కాగా, ఇలా ఎన్నికల ముందు వచ్చే వారిపై మాకు విశ్వాసం లేదని ముంపు గ్రామ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముంపునకు గురయ్యే బాధిత నిర్వాసిత కుటుంబాలకు ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించి ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.  ప్రత్యేకించి మల్లన్నసాగర్ ముంపు నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.