బీజేపీని వీడి టీఆర్ఎస్లో భారీగా చేరికలు

మహబూబ్‌నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఊరు ఊరంతా కదిలిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్వాడ మండలం బుద్దారం గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నేత సుధాకర్ రెడ్డి సహా సుమారు 500 మంది బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధిని చూసి బుద్ధారం గ్రామం కదిలివచ్చిందని ఆయన అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో చేరికల కార్యక్రమం జరిగింది. గత 25 ఏండ్లుగా గ్రామస్తుల ప్రధాన సమస్య అయిన బ్రిడ్జి నిర్మాణాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఇటీవలే బ్రిడ్జి నిర్మించి గ్రామస్తుల సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ని నమ్ముకున్న వారికి, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురికాకుండా బుద్ధారం గ్రామాన్ని కాపాడామనే కృతజ్ఞత గ్రామస్తుల్లో కనబడుతోందని ఆయన తెలిపారు.
పార్టీని, తమను నమ్ముకున్న వారికి అర్ధరాత్రి కష్టమొచ్చినా వెంటనే అక్కడ ప్రత్యక్షమై వారికి సాయం అందిస్తామన్నారు. హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు సహా అతని సోదరులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం రాగానే ఘటనా స్థలికి వెళ్లినట్లు మంత్రి తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రాయలసీమ గుండాయిజం నడవదని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనలో ఎంతటి స్థాయి వ్యక్తులున్నా వారిని పట్టుకుని లోపలేస్తామన్నారు. బీజేపీ నాయకులు శాంతయ్య, శేఖర్, కేశవులు, రాజు, వెంకటయ్య, నర్సింహులుతో సహా సుమారు 500 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
తాజావార్తలు
- 24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర