మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 07:12:58

ఠాణాల్లో షానిటైజర్లు, మాస్క్‌లు..

ఠాణాల్లో షానిటైజర్లు, మాస్క్‌లు..

హైదరాబాద్‌: ప్రజలతో నిత్యం మమేకమవుతూ 24/7 గంటలు పనిచేస్తున్న పోలీసులు కూడా ‘కరోనా’ విషయంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, అదనపు సీపీ శిఖా గోయెల్‌ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు నగరంలోని పోలీస్‌స్టేషన్లు, పెట్రోలింగ్‌ సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లను పంపిణీ చేశారు. పోలీస్‌స్టేషన్లలో నిత్యం వివిధ పనుల నిమిత్తం ప్రజలు వస్తుంటారు.. అలాంటి వారు రాగానే శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే సిబ్బంది కూడా తమ చేతులను శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్‌ ఠాణాల్లో శానిటైజర్ల పంపిణీ విషయంపై ట్విట్‌ చేశారు. 

         


logo