ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 21:03:03

పెళ్లిపత్రికతో పాటు మాస్క్‌లు...

పెళ్లిపత్రికతో పాటు మాస్క్‌లు...

మెట్‌పల్లి  : కరోనా వైరస్‌ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన బెజ్జారపు ప్రవీణ్‌-లక్ష్మీ వివాహం ఈ నెల 20న మెట్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరగనుంది. కాగా వరుడు ప్రవీణ్‌  తన పెళ్లి వేడుకలకు మాస్క్‌తో రండి అంటూ పెళ్లి పత్రికతో పాటు మాస్క్‌ను సైతం అందజేసి బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నాడు. 200 కార్డులతో పాటు 200 మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపాడు. logo