బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 17:18:06

మండలంగా మాసాయిపేట.. నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం

మండలంగా మాసాయిపేట.. నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లాలో కొత్తగా మాసాయిపేట మండలం ఏర్పాటయ్యింది. ఈ మేరకు 9 గ్రామాలతో మండలాన్ని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీచేసింది. చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్‌పల్లి, రామాంతపూర్‌, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డి గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మెదక్‌ జిల్లాలో మండలాల సంఖ్య 21కి చేరింది. 

తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌లో కొత్తగా మాసాయిపేటను మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ గత మంగళవారం అంగీకరించారు. దీనికి సంబంధించి సీఎం అధికారులను ఆదేశించారు. చేగుంట మండలంలోని మూడు గ్రామాలు, యెల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలను మొత్తంగా 9 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య 589కి చేరింది.   


logo