బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 20:15:27

మారుతీరావు విషం తీసుకున్నట్లు నిర్దారణ: సీఐ సైదిరెడ్డి

మారుతీరావు విషం తీసుకున్నట్లు నిర్దారణ: సీఐ సైదిరెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఖైరతాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సైఫాబాద్‌ సీఐ సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..మారుతీరావు విషం తీసుకున్నట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు తెలిపారు. ఆర్యవైశ్య భవన్‌లో క్లూస్‌ టీంతో తనిఖీలు చేయించాం. పరుపుపై పడి ఉన్న మారుతీరావును వెంటనే ఆస్పత్రికి తరలించాం. డాక్టర్లు మారుతీరావును పరీక్షించిన అనంతరం  మృతిచెందినట్లు ధృవీకరించారు. ఘటనాస్థలంలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  పోలీసులు మారుతీరావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు మారుతీరావు మృతదేహాన్ని మిర్యాలగూడ తీసుకెళ్లారు.

మారుతీరావు ఆత్మహత్య


logo