శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 19:11:14

మిర్యాలగూడకు మారుతీరావు మృతదేహం

మిర్యాలగూడకు మారుతీరావు మృతదేహం

హైదరాబాద్‌ :  ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు మృతదేహం మిర్యాలగూడకు చేరుకుంది. పోలీసుల భద్రతల మధ్య మారుతీరావు మృతదేహాన్ని  మిర్యాలగూడలోని నివాసానికి  తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా మారుతీరావు, అమృత ఇంటి వద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మారుతీరావు ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రేపు మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. logo