శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 06:19:02

ఆత్మరక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌..

ఆత్మరక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌..

మేడిపల్లి: కరాటే వల్ల ఆత్మస్థెర్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా శారీరక దారుడ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ అన్నారు. ఆదివారం పీర్జాదిగూడ బుద్ధానగర్‌లో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లా, తైక్వాండో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(లక్నో) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  తైక్వాడో రాష్ట్ర అసోసియేషన్‌ ప్రతినిధుల నేతృత్వంలో 2వ రాష్ట్ర స్థాయి (ఫిట్‌డాక్‌) తైక్వాండో చాంపియన్‌ షిప్‌-2020, తైక్వాండో బెల్ట్‌ గ్రేడింగ్‌ టెస్ట్‌-2020 పోటీలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు, యువతులపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటి నుంచి తనకు తాను రక్షంచుకునేందుకు మార్షల్‌ఆర్ట్స్‌ను నేర్చుకోవాలని ఆయన చూచించారు. పలు జిల్లాల నుంచి 15 టీంలు పాల్గొన్నాయి. ఇందులో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు తైక్వాండో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ ఫెటెర్‌ జగ్తియాని, అబ్దుల్‌ సత్తార్‌, రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.బాలరాజు, రాజునాయక్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.logo