బుధవారం 03 జూన్ 2020
Telangana - May 14, 2020 , 21:36:16

మాస్కులు ధరించి..కల్యాణమస్తు

మాస్కులు ధరించి..కల్యాణమస్తు

కోటపల్లి/రామకృష్ణాపూర్‌ : రెండు చోట్ల కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ వధూవరులు మాస్కులు ధరించి వివాహం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన భూతం దుర్గా భవాని, మందమర్రికి చెందిన అజయ్‌కుమార్‌ వివాహం గురువారం జరిగింది. కేవలం 18 మంది మాత్రమే హాజరయ్యారు. రామకృష్ణాపూర్‌ జోడుపంపుల ఏరియాకు చెందిన బల్ల గణపతి, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరుకు చెందిన ఆడెపు సాహితి(రేణుక) వివాహం నిరాడంబరంగా పెళ్లికుమార్తె స్వగృహంలో జరిగింది. వధూవరులు మాస్కులు ధరించారు. 20మంది వివాహానికి హాజరయ్యారు. వీరంతా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించారు. logo