బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 16:36:32

మెరూన్ కలర్ పాస్ పుస్తకాలు ప్రజల మేలు కోసమే

మెరూన్ కలర్ పాస్ పుస్తకాలు ప్రజల మేలు కోసమే

ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం ఉపయోగాలపై కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. వ్యవసాయ భూముల మాదిరిగానే ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకున్న పేదలకు ప్రభుత్వం మెరూన్ కలర్ పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా పలు సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , సుడా చైర్మన్ విజయ్ కుమార్, అదనపు కలెక్టర్ స్నేహలత తదితరులు పాల్గొన్నారు.


logo