శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 11, 2020 , 08:03:02

నేడు మార్క్‌ఫెడ్‌ పాలకమండలి ఎన్నిక

నేడు మార్క్‌ఫెడ్‌ పాలకమండలి ఎన్నిక

హైదరాబాద్‌ : మార్క్‌ఫెడ్‌ పాలకవర్గానికి బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం ఒంటిగంట వరకు నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులకు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైనపక్షంలో ఎన్నిక చేపడుతారు. మొత్తం 7 డైరెక్టర్‌ పోస్టులకుగాను ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన ఒక డైరెక్టర్‌ పదవిపై త్వరలో నిర్ణయం తీసుకొంటామని సహకారశాఖ ఎన్నికల అథారిటీ అధికారులు ప్రకటించారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌  ఎం గంగారెడ్డిని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది. వైస్‌చైర్మన్‌ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టంకాలేదు.


logo