గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 10:27:35

గిరిజ‌నుల‌ను అభివృద్ధికి దూరంచేస్తున్న మావోయిస్టులు

గిరిజ‌నుల‌ను అభివృద్ధికి దూరంచేస్తున్న మావోయిస్టులు

ములుగు: సామాన్య ప్ర‌జ‌ల‌పై మావోయిస్టులు హ‌త్యాకాండ కొన‌సాగిస్తున్నార‌ని ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్‌ అన్నారు. పార్టీ ఫండ్ ఇవ్వ‌నందుకే టీఆర్ఎస్ కార్య‌ర్త మాడూరి భీమేశ్వ‌ర‌రావును మావోయిస్టులు హ‌త్య‌చేశార‌ని చెప్పారు. భీమేశ్వ‌ర‌రావును మావోయిస్టులు ప‌లుమార్లు పార్టీ ఫండ్ అడిగార‌ని, ఆయ‌న తిర‌స్క‌రించ‌డంతోనే చంపార‌ని వెల్ల‌డించారు. క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లో భాగంగానే ఈ హ‌త్య‌జ‌రిగంద‌ని తెలిపారు. ఈఘ‌ట‌న‌లో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నార‌ని చెప్పారు. కుటుంబ స‌భ్యులు ప్రాధేయ‌ప‌డినా ప‌ట్టించుకోకుండా దారుణంగా క‌త్తుల‌తో పొడిచి చంపార‌ని పేర్కొన్నారు. డ‌బ్బులివ్వ‌ని సామాన్య ప్ర‌జ‌ల‌ను ఇన్‌ఫార్మర్ల నెపంతో హ‌త్య చేస్తున్నార‌న్నారు. గిరిజ‌నుల‌కు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు దూరం చేస్తున్నార‌ని వెల్ల‌డించారు.       

నిన్న అర్ధ‌రాత్రి జిల్లాలోని వెంక‌టాపురం మండ‌లం భోదాపురంలో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త భీమేశ్వ‌ర్ రావు (48) ఇంటిపై మావోయిస్టులు దాడిచేశారు. అత‌న్ని క‌త్తితో పొడిచి చంపారు. ఘ‌ట‌నా స్థ‌లంలో మావోయిస్టులు లేఖ‌ను వ‌దిలివెళ్లారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలంలో కత్తి, రెండు బుల్లెట్ల‌ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.    


logo