బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 16:51:39

భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు..తప్పించుకున్న మావోయిస్టులు

భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు..తప్పించుకున్న మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో మావోయిస్టుకు పోలీసుకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు కలకలం రేపాయి. ఈరోజు మధ్యాహ్నం జిల్లాలోని పాల్వంచ రిజర్వు అటవీ ప్రాంతంలో జిల్లా పోలీస్ పార్టీలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులకు పాల్పడ్డ మావోయిస్టులు పారిపోయినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కాల్పుల అనంతరం ఆ ప్రదేశంలో తనిఖీలు నిర్వహించి 01 SBBL తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుసుకున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.logo