శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 13:42:19

ఈ 25న తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

ఈ 25న తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

హైద‌రాబాద్ : సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ర్ట క‌మిటీ ఈ నెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. క‌వి వ‌ర‌వ‌ర‌రావుతో పాటు ఇత‌రుల‌ను వెంట‌నే జైలు నుండి విడుద‌ల చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. అదేవిధంగా అట‌వీ ప్రాంతాల నుంచి గ్రే హౌండ్స్ సిబ్బంది వెన‌క్కి వెళ్లాల్సిందిగా పేర్కొంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ క‌మిటీ అధికార ప్ర‌తినిధి జ‌గ‌న్ ఈ మేర‌కు లేఖ‌ను విడుద‌ల చేశారు. 

భీమా కోరెగావ్ సంఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు, ఇతరులను విడుదల చేయాలని అదేవిధంగా రాజకీయ ఖైదీలందరినీ, 60 ఏళ్లు పైబడిన ఖైదీలను విడుదల చేయాలని ప్ర‌జ‌లు డిమాండ్ చేయాల్సిందిగా పేర్కొన్నారు.


logo