శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 08:58:33

తాలిపేరు ప్రాజెక్టు వ‌ద్ద రోడ్డును పేల్చేసిన మావోయిస్టులు

తాలిపేరు ప్రాజెక్టు వ‌ద్ద రోడ్డును పేల్చేసిన మావోయిస్టులు

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం: జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు త‌గిడి వాగు వంతెన వ‌ద్ద ర‌హ‌దారిని మావోయిస్టులు పేల్చివేశారు. గుండాల ఎన్‌కౌంట‌ర్‌కు నిర‌స‌న‌గా ర‌హ‌దారిని పేల్చిన‌ట్లు అక్క‌డ విడిచి వెళ్లిన లేఖ‌‌లో పేర్కొన్నారు.  

ఈనెల 3న (గురువారం) తెల్ల‌వారుజామున గుండాల మండ‌లంలోని దేవ‌ల‌గూడెం, దుబ్బ‌గూడెం అడ‌వుల్లో పోలీసులు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మవోయిస్టు యాక్షన్ టీం సభ్యుడు మృతి చెందాడు.


logo