బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 18:42:31

మావోయిస్టుల వారోత్సవాలు..పోలీసుల విస్తృత తనిఖీలు

మావోయిస్టుల వారోత్సవాలు..పోలీసుల విస్తృత తనిఖీలు

మంచిర్యాల : మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పలు చోట్ల పోలీసులు వాహనాలు  తనిఖీ చేశారు. అనుమానితులను ఆపి వివరాలు సేకరించారు. మావోయిస్టుల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్‌ ఆపరేషన్స్‌ నిర్వహిస్తున్నారు. పోలీసు బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కదలికలపై పటిష్టమైన నిఘా పెట్టారు.


logo