గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 15:35:16

మావోయిస్టు మిలీషియా క‌మాండర్ అరెస్ట్

మావోయిస్టు మిలీషియా క‌మాండర్ అరెస్ట్

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : జిల్లాలోని అశ్వాపురం మండ‌లం మొండికుంట వ‌ద్ద పోలీసుల‌కు మావోయిస్టు మిలీషియా క‌మాండ‌ర్ ప‌ట్టుబ‌డ్డాడు. అత‌న్ని ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన హేమ‌ల జోగాగా పోలీసులు గుర్తించారు. మిలీషియా స‌భ్యుడు బాంబులు పెట్టేందుకు య‌త్నిస్తుండ‌గా పోలీసులు అరెస్టు చేశారు. జోగా నుంచి 5 జిలెటిన్ స్టిక్స్, 2 డిటోనేట‌ర్లు, 2 బ్యాట‌రీలు, టిఫిన్ బాక్స్‌తో పాటు తీగ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. 

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పేలుడు ప‌దార్థాలు స్వాధీనం

బీజాపూర్ జిల్లా గంగ‌ళూరులో పోలీసులు పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కాలిన‌డ‌క బాట‌లో అమ‌ర్చిన 4 కిలోల ఐఈడీని పోలీసులు నిర్వీర్యం చేశారు. గంగ‌ళూరులో పోలీసులు కూంబింగ్ నిర్వ‌హిస్తుండ‌గా ఐఈడీ ల‌భ్య‌మైంది.