గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 18:29:07

మావోయిస్టు దళసభ్యుడు లొంగుబాటు...

మావోయిస్టు దళసభ్యుడు లొంగుబాటు...


భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా ఎస్పీ సునిల్‌ దత్‌ ఎదుట మావోయిస్టు దళ సభ్యుడు లొంగిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలను అడిషనల్‌ ఎస్పీ రమణారెడ్డి పాల్వంచ డీఎస్పీ కార్యాలయంలో వివరించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా జిల్లెలగూడ గ్రామానికి చెందిన అడవి దేవా అలియాస్‌ రవి(23) ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. దేవా 2010 నుంచి 2014 వరకు ఆమేడం బాలబాలికల సంఘంలో సభ్యుడిగా చేరాడు. 

తర్వాత కామెడీ ఏరియా కమాండర్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో 2015 నుంచి పామేడు ఎల్ వై ఎఫ్ దళసభ్యుడిగా పనిచేశాడు. అనంతరం లక్ష్మణ్ కు ప్రొటెక్షన్‌ గార్డుగా ఉన్నాడు. మెరుగైన జీవనం గడిపేందుకే తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు దేవా తెలిపాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న తన బంధువుల ద్వారా ఈ రోజు ఎస్పీని కలిసి లొంగిపోయాడు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాద్‌రావు, సీఐ నవీన్‌ పాల్గొన్నారు. 


logo