శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 09:03:16

దళకమాండర్‌ను హతమార్చిన మావోయిస్టులు

దళకమాండర్‌ను హతమార్చిన మావోయిస్టులు

చర్ల: మావోయిస్టు దళ కమాండర్‌ను సహచర మావోయిస్టులే హతమార్చారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని డివిజన్‌ కమిటీ కమాండర్‌ విజా మోడియం అలియాస్‌ భద్రు (39) కొంతకాలంగా వ్యక్తిగత కక్షలతో ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఆదివాసీలను హతమారుస్తున్నాడనే ఆరోపణలున్నాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు మావోయిస్టులు విజాని గురువారం గంగలూరు-కిరండూల్‌ గ్రామాల మధ్య గల ఎటావర్‌ అటవీ ప్రాంతంలో హత్య చేసి అర్ధరాత్రి అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పి ధ్రువీకరించారు.