శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 22:05:45

ములుగు జిల్లాలో మావోయిస్టు అరెస్టు

ములుగు జిల్లాలో మావోయిస్టు అరెస్టు

ములుగు : జిల్లాలో విప్లవ ప్రజాకమిటీ (ఆర్‌పీసీ) సభ్యుడిగా ఉన్న మావోయిస్టును అరెస్టు చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఆగస్టు 3న కొట్టపల్లి క్రాస్ రోడ్డు వద్ద సాయంత్రం 4 గంటల సమయంలో సీఆర్పీఎఫ్‌ సిబ్బందితోపాటు వెంకటాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా అనుమానాస్పదంగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు.

పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారించగా మావోయిస్టు, విప్లవాత్మక పీపుల్స్ కమిటీ సభ్యుడు సోడి వూరా అలియాస్ వూరాడుగా నిర్ధారణ అయ్యిందని ములుగు జిల్లా ఏఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుడిని పోలీసులు కోర్టుకు రిమాండ్‌కు చేశారు. వూరా మావోయిస్టు పార్టీలో 2012లో మిలీషియా సభ్యునిగా చేరారు. తరువాత ఆర్‌పీసీ సభ్యుడిగా అటు తరువాత పూజారికంకర్ ఆర్‌పీసీ సభ్యుడిగా నియమించబడ్డాడు.
 


logo