e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 29, 2021
Home News మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి?

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి?

  • బస్తర్‌ అడవుల్లో మరణం.. ధ్రువీకరించని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు
  • నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర
  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కే
  • ఆయనపై రూ.97 లక్షల రివార్డు ప్రకటించిన నాలుగు రాష్ర్టాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ (ఆర్కే) మృతి చెందినట్టు వార్తలు వెలువడ్డాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్‌ అడవుల్లో గురువారం తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది. ఇటు మావోయిస్టుపార్టీ గానీ, అటు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు గానీ ఆయన మృతిని ధ్రువీకరించలేదు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా మాచర్ల మండలం తుమ్మకోట గ్రామం. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత మావోయిస్టు పార్టీలో చేరారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. పలు ఎన్‌కౌంటర్లలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు చెప్పుకుంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన శాంతిచర్చల్లో ఆర్కే కీలకపాత్ర పోషించారు. ఆయనపై ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా ప్రభుత్వాలు రూ.97 లక్షల రివార్డును ప్రకటించాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement