మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 13:12:28

'పాలమూరు తిరుపతి' లో భక్తుల పూజలు

'పాలమూరు తిరుపతి' లో భక్తుల పూజలు

మహబూబ్‌నగర్‌ : పాలమూరు తిరుపతి గా పేర్కొనే మన్యంకొండ శ్రీ వేంకటశ్వరస్వామి ఆలయం భక్తుల దర్శనాల నిమిత్తం తిరిగి తెరుచుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర సమీపంలోని పేదల తిరుపతిగా పిలుచుకునే మన్యంకొండ ఆలయంలో  కరోనా కారణంగా భక్తులకు గడిచిన రెండు నెలలుగా దర్శనాలను నిలిపివేశారు. దేవాదాయశాఖ సూచించిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆలయ ప్రవేశ ద్వారంలో భక్తుల శరీర ఉష్ణోగ్రత తెలుసుకునేందుకు థర్మల్‌ స్క్రీనింగ్‌ని నిర్వహిస్తున్నారు. భౌతికదూరం పాటించేలా చూస్తే భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఎత్తైన కొండపై, ప్రశాంత వాతావరణంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. మన్యంకొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం. 
logo