సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 12:54:27

వరదలతో హైదరాబాద్‌లోని పలు రోడ్లు మూసివేత

వరదలతో హైదరాబాద్‌లోని పలు రోడ్లు మూసివేత

హైదరాబాద్‌ : శనివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రహదారులు మొత్తం జలమయమయ్యాయి. పలు కాలనీల్లో, రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు బారికేడ్లతో రహదారులను మూసివేశారు. మలక్‌పేట రైలు వంతెన, ముసారాంబాగ్‌ వంతెన రోడ్లు మూసివేశారు. చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌ 100 ఫీట్‌రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. గడ్డిఅన్నారం నుంచి శివగంగ రోడ్లు అదేవిధంగా బండ్లగూడ మీదుగా ఆరాంఘర్‌ వెళ్లే దారి, మహబూబ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి ఐఎస్‌ సదన్‌కు వెళ్లే రోడ్డును మూసివేశారు. 


logo