శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 02:20:07

తెలంగాణలో తక్కువ మరణాలు

తెలంగాణలో తక్కువ మరణాలు

  • దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం
  • లోక్‌సభలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణ అనేక జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకున్నదని, వైరస్‌ కట్టడి విషయం లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. దేశంలోనే తక్కువ మరణాలు తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. ఆదివారం లోక్‌సభలో కరోనాపై జరిగిన చర్చలో రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, వైద్య, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాలని ప్రధానమంత్రికి మొదట సూచించింది సీఎం కేసీఆర్‌ అని గుర్తుచేశారు. దేశంలోనే మొదట లాక్‌డౌన్‌ తెలంగాణలో విధించారని, బతికుంటే బలుసాకు తినవచ్చని సీఎం కేసీఆర్‌ చెప్పి అనేక జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకున్నారని రంజిత్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ కాలంలో 634 కేంద్రాల ద్వారా 1.56కోట్ల మందికి ఉచిత భోజన వసతిని కల్పించినట్టు చెప్పారు. 


logo