శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 11:34:45

చారిత్ర‌క సంప‌ద‌ను కాపాడుతున్నాం: మ‌ంత్రి శ్రీనివాస్ గౌడ్‌

చారిత్ర‌క సంప‌ద‌ను కాపాడుతున్నాం: మ‌ంత్రి శ్రీనివాస్ గౌడ్‌

హైద‌రాబాద్‌: రాష్ట్రానికి సంబంధించిన చారిత్ర‌క సంప‌ద‌ను కాపాడుతున్నామ‌ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నో చారిత్ర‌క క‌ట్ట‌డాలు ఉన్నాయ‌ని చెప్పారు. శాస‌న‌మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. యాదాద్రి ఆల‌యాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మిస్తున్నార‌ని చెప్పారు.

వార‌స‌త్వ క‌ట్ట‌డాలు, టూరిజం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కరించ‌డంలేద‌ని ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి ఆరోపించారు. కాక‌తీయుల కాలంనాటి ఆల‌యాల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని చెప్పారు. వార‌సత్వ క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌కు ఏఎస్ఐ ప‌నిచేయ‌డంలేద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప‌నిచేసుకోనివ్వ‌డంలేద‌ని విమ‌ర్శించారు.    


logo