మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 17:03:24

'మ‌ను' ప్ర‌వేశ ప‌రీక్ష‌ల ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

'మ‌ను' ప్ర‌వేశ ప‌రీక్ష‌ల ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

హైద‌రాబాద్ : కోవిడ్ -19 మహమ్మారి నేప‌థ్యంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం (మ‌ను) 2020-21 విద్యా సంవత్సరం రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశానికి కాలపరిమితిని సవరించింది. ప్రవేశ ప‌రీక్ష‌ ఆధారిత కోర్సులకు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 24 కాగా, మెరిట్ ఆధారిత కోర్సులకు చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన‌ట్లు ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌నో పేర్కొంది. ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 19, 20వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఫలితాల‌ను సెప్టెంబర్ 30న ప్రకటించనున్న‌ట్లు వెల్ల‌డించింది. 

ప్రవేశ ఆధారిత కోర్సులైన బి.టెక్ (కంప్యూటర్ సైన్స్), ఎం.టెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎం.ఎడ్, డి.ఎల్.ఎడ్ వంటి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా, పీహెచ్‌డీ, మెరిట్ ఆధారిత కోర్సుల జాబితా కోసం వెబ్‌సైట్ manuu.edu.in ని సందర్శించి తెలుసుకోవ‌చ్చు. logo