బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 26, 2020 , 15:37:26

గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన విద్యార్థులు

గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన విద్యార్థులు

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానసపుత్రిక హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నది.

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానసపుత్రిక హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నది.

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఇవాళ మణుగూరు మండలంలోని ఎక్సలెంట్ స్కూల్ లో  విద్యార్థులు మొక్కలు నాటారు.  స్కూల్ కరస్పాండెంట్ మొహమ్మద్ యాకుబ్ షరీఫ్..మాట్లాడుతూ  గాలిని , నీరుని కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని మన పెద్దలు చెప్పినట్టు..మన దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటి దుస్థితి భావితరాలకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరం ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని..మొక్కలు నాటవలిసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేయాలని కోరారు. 




logo