శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 01:53:58

మానవజాతి గోసను కండ్లకు కట్టింది: అనిమెష పుస్తకావిష్కరణలో రచయిత ఏలూరి రఘు

మానవజాతి గోసను కండ్లకు కట్టింది: అనిమెష పుస్తకావిష్కరణలో 	రచయిత ఏలూరి రఘు

  • అనిమెష పుస్తకావిష్కరణలో  రచయిత ఏలూరి రఘు
  • సిధారెడ్డి సామాజిక స్పృహను చాటారని వ్యాఖ్య

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడ్డ కష్టాలు, వలస కార్మికుల గోస, మానవజాతి మొత్తం పడిన ఇబ్బందులను నందిని సిధారెడ్డి అనిమెష కావ్యంలో కండ్లకు కట్టినట్టు రాశారని ప్రముఖ పాత్రికేయుడు, రచయిత ఏలూరి రఘు పేర్కొన్నారు. ప్రజాకవి నందిని సిధారెడ్డి రచించిన అనిమెష కావ్యం ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏలూరి రఘు మాట్లాడుతూ.. సకల జీవుల బాధలు, అంతుచిక్కని వైరస్‌ చాపకింద నీరులా వ్యాపించడాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచి సిధారెడ్డి మరోసారి సామాజిక స్పృహను, మానవీయతను నిరూపించుకున్నారని కొనియాడారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాలేశ్వరం శంకరం, టీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్‌ అలీ, తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.